హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎస్‌ఐఆర్ మెగా ప్రత్యేక శిబిరం: MRO

ASF: జైనూర్ మండల కేంద్రంలో నేడు ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ కోసం మెగా ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ అడబీర్ షా తెలిపారు. ఈ శిబిరంలో రెవెన్యూ సిబ్బందితో పాటు 30 మంది ప్రత్యేక వాలంటీర్లు పాల్గొని, ప్రజలు తీసుకువచ్చిన దరఖాస్తులను నింపి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.