హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయంలో రీల్స్.. పోలీసులకు ఫిర్యాదు

తమిళనాడులోని పళని దండాయుధపాణి ఆలయంలో ఓ ప్రైవేట్ వస్త్ర కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం రీల్స్ తీయడం వివాదాస్పదమైంది. ఇద్దరు యువతులతో సినిమా పాటలతో తీసిన ఈ వీడియోలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక స్థలాన్ని వాణిజ్యపరంగా వాడటంపై వ్యతిరేకత రావడంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకపై ఇలాంటి వీడియోలు తీయబోమని వారి నుంచి పోలీసులు హామీ పత్రం తీసుకున్నారు.