హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్. జానకమ్మ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

TG: ప్రముఖ గాయని ఎస్. జానకమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె మృతి దక్షిణ భారత సంగీతానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జానకమ్మ కుటుంబం సిరిసిల్ల వాసులు కావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. పద్మభూషణ్ తిరస్కరించిన ధీర వనిత అని కొనియాడారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు, కోట్ల మంది అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.