హైదరాబాద్: 28°C
వార్తలు

HYDలో దేశంలోనే తొలి మెకానికల్ పాలిషింగ్ హబ్

TG: సెమీకండక్టర్, చిప్‌ల తయారీకి కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీ దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్ టీ-వర్క్స్‌లో ఏర్పాటైంది. జపాన్ సంస్థ తోహో కోకి సహకారంతో నెలకొల్పిన ఈ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ ప్యాడ్లను, రాబోయే రోజుల్లో ఇక్కడే పరిశోధనలు జరుపుతామన్నారు.