హైదరాబాద్: 28°C
వార్తలు

'తెలంగాణ పోక్సో కేసులకు రాజధానిగా మారింది'

TG:  రాష్ట్రంలో పోక్సో కేసులు, హత్యలు ఆందోళనకరంగా మారాయని బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ విమర్శించారు. హోంశాఖ తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ .. పాలన వదిలి రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. షాబాద్ దైవాలగూడలో ఆరుగురిని నరికి చంపిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. నిందితుడిపై గతంలో కేసులున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు.