KNR: చిగురుమామిడి (M) కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి గదిని సర్పంచ్ ఆకవరం భవాని, మండల విద్యాధికారి జయప్రద, అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలకలు, ప్రీ ప్రైమరీ పుస్తకాలు పంపిణీ చేసి అక్షరాభ్యాసం నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు.
వార్తలు
అక్షరాభ్యాసంతో ప్రారంభమైన ప్రీ ప్రైమరీ విద్య


