హైదరాబాద్: 28°C
వార్తలు

అరిలోవలలో గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

VSP: అరిలోవ లాస్ట్ బస్ స్టాప్ సమీపంలో టాస్క్‌ఫోర్స్ అరిలోవ పోలీసులు శనివారం సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 5 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయానికి తీసుకొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అరెస్టైన వారిలో ఒడిశాకు చెందిన ఉగ్రసేన్ గెమెల్‌తో పాటు విశాఖ, విజయనగరం చెందిన వారున్నారు.