హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్రం మా సహనాన్ని బలహీనతగా భావించవద్దు'

జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో కేంద్రం తమ సహనాన్ని బలహీనతగా భావించవద్దని సీఎం ఒమర్ అబ్దుల్లా హెచ్చరించారు. లడఖ్‌తో చర్చలు జరుపుతున్న కేంద్రం, కశ్మీర్ ప్రజలతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర హోదా డిమాండ్‌పై జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోయే నిరసనకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.