హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 21, 22న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్ సమావేశ మందిరంలో జూలై 21, 22 తేదీల్లో పెన్షన్ అండ్ జీపీఎఫ్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ తెలిపారు. పెన్షన్, జీపీఎఫ్, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం, మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యమన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొనాలని తెలిపారు.