సత్యసాయి: లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ నాగరాజు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు జేఎన్వీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
వార్తలు
ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


