ADB: గుడిహత్నూర్ మండలం కొల్హారిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు కోవా చైతన్య - అశోక్ దంపతుల నూతన గృహ ప్రవేశాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇంతియాజ్ ఖాన్, హౌసింగ్ డీఈ రమేశ్, సర్పంచ్ శివాజీ, పలువురు పాల్గొన్నారు.
వార్తలు
కొల్హారిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం


