హైదరాబాద్: 28°C
వార్తలు

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు హెచ్చరిక

NTR: జిల్లాలోని మైలవరం సర్కిల్ పోలీసులు మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. తెలియని లింకులు, APK ఫైళ్లు, QR కోడ్‌లు, నకిలీ ఉద్యోగాలు, లోన్, గిఫ్ట్, లక్కీ డ్రా ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. OTP, UPI PIN, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.