హైదరాబాద్: 28°C
వార్తలు

'జూలై 13న విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ'

BDK: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జూలై 13న 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు చర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ హారిక తెలిపారు. శనివారం చర్ల పిహెచ్సిలో మాట్లాడిన ఆమె ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.