హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

NRML: కడెం మండలంలోని పెద్దబెల్లాల్ గ్రామ కాంగ్రెస్ కమిటీని మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తోట రాజేందర్, ఉపాధ్యక్షుడిగా మైదం రమేష్, తాటికొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మిన గంగరాజు, కార్యదర్శులుగా ఆకుల రాజు, కిషన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.