హైదరాబాద్: 28°C
వార్తలు

331 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకుకూరల సాగు

KMR: జిల్లాలోని 331 సక్షం అంగన్‌వాడీ కేంద్రాల్లో సేంద్రియ విధానంలో 5 రకాల ఆకుకూరలు పండించడానికి విత్తనాలు సరఫరా చేశామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి ప్రసన్న తెలిపారు. పురుగు మందులు వాడని ఆకుకూరలను సాగుచేసి చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారంగా అందించనున్నట్లు చెప్పారు. పాలకూర, తోటకూర, మెంతి, గోంగూర సాగు చేస్తున్నట్లు తెలిపారు.