ASR: అనంతగిరి మండలం బొర్రా–కటిక జలపాతం రహదారి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.13 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో వర్షాలకు కంకర కొట్టుకుపోయి రోడ్డంతా గుంతలమయమైంది. రహదారి చెరువును తలపిస్తుండటంతో ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
అధ్వానంగా బొర్రా–కటిక రహదారి


