SDPT: హాస్టల్లో ఉండడం ఇష్టం లేక పారిపోయిన ఇద్దరు విద్యార్థులను చేర్యాల బ్లూ కోల్ట్స్ పోలీసులు రక్షించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు సిబ్బంది రవి, వెంకటేష్ పెట్రోలింగ్ చేస్తుండగా ముస్త్యాల బస్టాండ్ వద్ద ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు కనిపించారు. విచారణలో హాస్టల్ నచ్చక పారిపోయినట్లు తెలపడంతో, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వార్డెన్‌కు అప్పగించారు.
వార్తలు
పారిపోయిన స్టూడెంట్స్.. రక్షించిన పోలీసులు


