ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ జగదీశ్ నాయక్, సీహెచ్‌వో ప్రశాంత్ పాల్గొని ప్రజలకు కుటుంబ నియంత్రణ, చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. పెరుగుతున్న జనాభాను సమతుల్యంగా నియంత్రించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.
వార్తలు
రాజేంద్రపాలెం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ర్యాలీ


