హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధిలో భారత్ సరికొత్త రికార్డులు: మోదీ

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన భారతీయ సమాజ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్లు, పాల ఉత్పత్తిలో భారత్ నెంబర్ వన్‌గా నిలిచిందని, మొబైల్ తయారీ, టెలికాం మార్కెట్లలో రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని మోదీ గర్వంగా చాటారు.