హైదరాబాద్: 28°C
వార్తలు

సహకార సమితి సంఘం ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో శనివారం నూతనంగా ఆధునీకరించిన ది బుద్దవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ (పీఏసీఎస్)ను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్‌తో కలిసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార వ్యవస్థ వెన్నెముక వంటిదని తెలిపారు.