NLG: నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శనివారం నల్గొండ ఆర్డీవోను కలిసి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి, అనర్హుల ఓట్లను తొలగించి, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. స్థానికంగా లేని వారి ఓట్లు, గత ఉద్యోగుల పేర్లు ఇంకా జాబితాలో ఉండటం, ఓట్లను ఇతర ప్రాంతాలకు మార్చడం వంటి తప్పులను సరిచేయాలన్నారు.
వార్తలు
'సర్' ప్రక్రియపై ఆర్డీవోతో మాజీ ఎమ్మెల్యే చర్చ


