హైదరాబాద్: 28°C
వార్తలు

ఇది పాడుబడిన బంగ్లా కాదు..పినపాక బస్టాండ్

BDK: పినపాక మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నిర్లక్ష్యానికి గురైంది. పిచ్చి మొక్కలు, కలుపు చెట్లతో బస్టాండ్ ప్రాంగణం నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బయ్యారం నుండి కరకగూడెం ప్రధాన రహదారి పక్కన ఉన్నప్పటికీ ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.