KRNL: కల్లూరు మండలం బస్తీపాడులో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించాలని ఆమె ఆకాంక్షించారు.
వార్తలు
ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ


