NGKL: అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో స్తంభాలకు పగటిపూట కూడా వీధిలైట్లు వెలుగుతున్నాయి. దీనివల్ల విద్యుత్తు వృథా కావడమే కాకుండా, ఆ ఆర్థిక భారం పరోక్షంగా పన్నుల రూపంలో తమ పైనే పడుతుందని ఆందోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి, పగటిపూట లైట్లు బంద్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
పట్టపగలు వెలుగుతున్న విద్యుత్తు లైట్లు


