హైదరాబాద్: 28°C
వార్తలు

మూఢనమ్మకం.. ముగ్గురు మృతి

SKLM: జలుమూరు మండలం మర్రివలసలో విషాదం జరిగింది. తీవ్ర అనారోగ్యంతో చనిపోయిన తండ్రి దెయ్యమై పీడిస్తున్నాడనే మూఢనమ్మకాలతో తల్లీ, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. దాలెప్పమ్మ(65), ఆమె కుమార్తెలు దాలమ్మ(45), దివ్యాంగురాలు సరస్వతి(35) గడ్డిమందు తాగారు. తల్లి ఇంట్లోనే మరణించగా, కుమార్తెలు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎస్ఐ అశోక్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.