హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మేదరమెట్లలో పోలీసుల తనిఖీలు.. వాహనాలపై కొరడా

BHPL: మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి, పత్రాలు లేని ద్విచక్రవాహనాలకు జరిమానాలు విధించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు.