హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమల శ్రీవారి సన్నిధిలో నాగజ్యోతి కుటుంబం

ములుగు నియోజకవర్గ BRS పార్టీ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులలతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.