TG: ఖమ్మం సభలో సీఎం రేవంత్ వ్యక్తిగత దూషణలు చేశారని మాజీమంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. బాడీ షేమింగ్ చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఖమ్మంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేశారా? అని నిలదీశారు. కేసీఆర్‌పై కోపంతోనే కాళేశ్వరాన్ని పట్టించుకోవడంలేదని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. మంత్రులు తామే తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
వార్తలు
CM రేవంత్ వ్యాఖ్యలపై పువ్వాడ మండిపాటు


