హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. యోచనలో కేంద్రం

ఇకపై ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్ నిబంధన వర్తించేలా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సెన్సార్ విషయంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓటీటీ చిత్రాలకు సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ అవసరం లేదు. దీంతో సెన్సార్ నిరాకరించిన పలు చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.