వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ను సినర్ ఓడించాడు. దీంతో జకోవిచ్ ఆటకు వీడ్కోలు పలుకుతాడంటూ జరుగుతున్న ప్రచారం జోరందుకుంది. దీనిపై తాజాగా జకోవిచ్ స్పందించాడు. కనీసం ఇంకోసారైన వింబుల్డన్‌కు తిరిగి రావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో అప్పుడే తన ఆట అయిపోలేదని జకోవిచ్ స్పష్టత ఇచ్చినట్లైంది.
క్రీడలు
రిటైర్మెంట్‌పై జకోవిచ్ స్పష్టత


