హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు

ASF: తిర్యాణి మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేకపోవడం వల్ల చిన్న ప్రమాదాలకే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం తాగి నడపడం, ట్రిపుల్ రైడింగ్ చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.