హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన

ADB: బోథ్ మండలం కనుగుట్ట జడ్పీ హైస్కూల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'ఆరోగ్య పాఠశాల' సదస్సు నిర్వహించారు. ఐసీపీఎస్ లీగల్ అధికారి కుట్ల రమేష్, సఖి కేంద్రం ప్రతినిధి నాగమణి పాల్గొని, పోక్సో చట్టం-2012పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో హెల్ప్ లైన్ నంబర్లు 100, 1098, 181, 1930లను ఎలా సంప్రదించాలో వివరించారు.