హైదరాబాద్: 28°C
వార్తలు

వారిపై చర్యలు తీసుకుంటాం: రంగనాథ్

TG: హుస్సేన్‌సాగ‌ర్ FTL ప‌రిధిలోని MS మక్తా, BS మ‌క్తా పేదల ఇళ్లను కూల్చేది లేద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్థానికులకు సూచించారు. కబ్జాదారుల స్వార్థానికి అమాయకులు బలికావొద్దన్నారు. నోటీసులంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ, MMTS వద్ద ఆందోళన చేయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.