హైదరాబాద్: 28°C
వార్తలు

ఉడిపి హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

హనుమకొండ బస్టాండ్ సమీపంలోని ఓ ఉడిపి హోటల్‌లో వడ్డించిన భోజనంలో ఈగలు వచ్చాయంటూ వినియోగదారుల ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి ఆహార నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా హోటల్ పై చర్యలు తీసుకుంటామన్నారు.