NRML: నిర్మల్ పాత కలెక్టరేట్ ఆవరణలో రూ.20.17 లక్షలు వెచ్చించి నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా మారింది. ప్రారంభించిన వారం రోజులకే దీనిని మూసివేయడంతో నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. నిర్వహణ ఏజెన్సీలు పట్టించుకోకపోవడంతో లోపలి సామాగ్రి సగం దొంగలపాలవ్వగా, మిగతాది పాడైపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తెవాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
లక్షలు వెచ్చించినా.. మూన్నాళ్ల ముచ్చటే..!


