హైదరాబాద్: 28°C
వార్తలు

BC విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి: ఇందిరా

BHPL: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న BC విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర సూచించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 4,000 ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పూర్తి చేయాలని కోరారు.