TG: తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. చారిత్రాత్మక గోల్కొండ మహంకాళి ఆలయం నుంచి ఈ నెల 16న తొలి బోనం ప్రారంభం కానుంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం సీఎం రూ.20 కోట్లు మంజూరు చేశారు. మహిళా భక్తుల రక్షణ కోసం షీ టీమ్స్‌తో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
బోనాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కొండా సురేఖ


