హైదరాబాద్: 28°C
వార్తలు

న్యూ జీజీహెచ్‌లో కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ

NTR: కలెక్టర్ డా. జీ. లక్ష్మీశ విజయవాడ న్యూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం, రోగుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరిస్తూ.. న్యూ జీజీహెచ్‌ను రాష్ట్రంలోనే నంబర్-1 ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.