ప్రకాశం: మర్రిపూడి (M) వల్లాయపాలెం నుంచి మర్రిపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యాలులేక ఆటోలో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆటో ఇరువైపులా విద్యార్థులు నిలబడి ప్రయాణం చేస్తుండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని చూసేవారికి ఆందోళన కలుగుతుంది. ప్రమాదం జరిగిన నష్టం జరగకముందే ఆటోలో అధికంగా ప్రయాణించే చర్యలను నివారించాలని పలువురు కోరారు.
వార్తలు
విద్యార్థుల ప్రమాదకర ఆటో ప్రయాణం


