హైదరాబాద్: 28°C
వార్తలు

వరదలు.. కొట్టుకుపోయిన బ్రిడ్జి

Advertisement

సిక్కింను భారీ వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఉత్తర సిక్కిం మంగన్ జిల్లాలోని ఫిడాంగ్ వద్ద ఫీఖోలా వాగుపై నిర్మించిన బైలీ అనే తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఫిడాండ్-సంకలాంగ్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం రాకాసి అలలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వంతెన పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement