గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రేపు జూన్ 25న ఒక మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. SSC నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు అన్ని యోగ్యతలు ఉన్న యువకులు, యువతులు ఈ జాబ్ మేళాకు హాజరవ్వాలని తెలిపారు. రూ. 10,000 నుంచి రూ. 45,000 వరకు జీతాలతో అనేక కంపెనీలు ఇక్కడికి వస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియెగం చేసుకోవాలని కోరారు.
Advertisement


