AKP: వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలను రైతులు సాగు చేయాలని కోటవురట్ల మండలం వ్యవసాయ అధికారి సరోజిని సూచించారు. మంగళవారం తంగేడులో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల వద్దకు వెళ్లి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువ కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
వార్తలు
'వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలు సాగు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


