హైదరాబాద్: 28°C
వార్తలు

RAIN ALERT: రాష్ట్రంలో భారీ వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. ఇవాళ పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అల్లూరి, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, 40-50 KMPH వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. వర్షం పడేటప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని సూచించింది.