హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎస్‌హెచ్‌జీలకు 553 బస్సులు అందజేత

TG: ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక బస్సు చొప్పున 553 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం రేవంత్‌ రెడ్డి సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఇవాళ మహిళా సంఘాలకు అందజేస్తారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అలాగే, రూ.500 కోట్ల వడ్డీ రాయితీని మహిళలకు అందజేయనున్నట్లు వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్‌లో సీఎం సభకు ఏర్పాట్లు చేశారు.