హైదరాబాద్: 28°C
వార్తలు

కలహాలొద్దు.. కలిసి పనిచేద్దాం: ఇండియా కూటమి

ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్గత కలహాలను పక్కన పెట్టడం, సామాజిక ఉద్యమాల్లో కలిసి పాల్గొనడం, కూటమికి కాంగ్రెస్ లీడ్ చేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మిత్రపక్షాలు ఒకరినొకరు విమర్శించుకోకూడదని టీఎంసీ అధినేత మమతా పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటే బలం, విడిపోతే పతనం అనే సందేశాన్ని రాహుల్ ఇచ్చారు.