హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రుణమాఫీ అమలుపై బ్యాంకు వద్ద రైతుల ఆందోళన

KMM: తిమ్మారావుపేటలో రుణమాఫీ ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ పలువురు రైతులు బ్యాంకు శాఖ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు వర్తించాల్సిన రుణమాఫీ ప్రయోజనాలు ఎందుకు అందలేదంటూ బ్యాంకు అధికారులను వివరణ కోరారు. సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొని తమ సమస్యలను అధికారులకు తెలిపారు.