హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ ధరల పెంపు.. కేంద్రంపై ఖర్గే మండిపాటు

దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్యులపై భారం పడుతోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. 4 నెలల్లో LPG సిలిండర్ ధరను కేంద్రం రూ.89 పెంచినట్లు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ LPG కొరత ఎందుకు ఉందని, ద్రవ్యోల్బణంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.