హైదరాబాద్: 28°C
వార్తలు

ఆస్తి కోసమే ఢిల్లీ ప్రొఫెసర్‌ హత్య

ఢిల్లీ వర్సిటీ మహిళా ప్రొఫెసర్ దేవోస్మిత మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగాల్‌లో ప్రొఫెసర్‌కు ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతులే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్థరణకు వచ్చారు. కోట్ల విలువ చేసే ఇంటిని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. అందుకే ఢిల్లీకి వచ్చి ఈ హత్య చేశారని.. వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.