హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నిరసన

నీట్ పేపర్ లీక్‌ను వ్యతిరేకిస్తూ హర్యానాలో కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సీఎం నాయబ్ సైనీ ఇంటిని ముట్టడించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఇంటి ముట్టడితో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నాయకులపై వాటర్ కెనాల్స్‌ను ప్రయోగించారు.