హైదరాబాద్: 28°C
వార్తలు

మెట్రోలో ప్రయాణించిన సీఎం

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మెట్రో రైలులో ప్రయాణించారు. సీఎం పదవి చేపట్టాక తొలిసారి తన నియోజకవర్గం కనకపురలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విధాన సౌధ స్టేషన్ నుంచి కనకపుర స్టేషన్ వరకు మెట్రోలో వచ్చారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లారు. మెట్రోలో ఆయన ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయనతో పలువురు సెల్ఫీలు దిగారు.